ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదు : సీఎం జగన్

అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు సీఎం జగన్.. చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అంటూ విమర్శించారు.. గతంలో దళితుల గురించి చంద్రబాబు లోకువగా మాట్లాడిన సంగతి ఎవరూ మర్చిపోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల మేలు కోసమే తాము ఎస్సీ, ఎస్టీలకు వేరు వేరు కమిషన్ల బిల్లును సభలో ప్రవేశ పెట్టామన్నారు జగన్..
ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముద్రవేసుకున్నారని జగన్ ఆరోపించారు. అప్పట్లో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దళితుల గురంచి చుకలకనగా మాట్లడితే.. కింది స్థాయి వాళ్లు ఎలా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు..
రాజకీయాలు, ఓట్ల గురించి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని జగన్ విమర్శించారు. ఓట్లు కావాలి అనుకుంటే కులాల మధ్య, అన్నదమ్ముల మధ్య అయినా చిచ్చు పెట్టడానికి వెనుకడారని గుర్తు చేశారు. అధికారం కోసం పిల్లను ఇచ్చిన సొంతమామకే వెను పోటు పొడిగిన ఘనత చంద్రబాబుది అని సెటైర్ వేశారు..
వందేళ్ల కిందట ఎస్సీగా పుట్టేందుకైనా తాను సిద్ధమని గురజాడ అంటే.. ఇప్పుడు చంద్రబాబు దళితుడుగా ఎవరైనా పుడతారా అని ప్రశ్నిస్తున్నారని.. ఇలాంటి పాలకులు మనకు అవసరమా అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com