దిశ కేసులో కమిషన్‌కి కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు, నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం.. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ ఈ వారంలో హైదరాబాద్ రానుంది. పూర్తిస్థాయిలో కేసును దర్యాప్తు చేసి, ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు పరిశీలించి, రిపోర్ట్ ఇవ్వనున్నందున.. కమిషన్ సభ్యులు ఈ ఆరు నెలలు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. వీరి కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమాజీగూడలోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌ను కానీ, నగరం శివారులో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీలో కానీ ఆఫీస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రిటైర్డ్ జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో కమిటీ హైదరాబాద్‌కి రాగానే వారితో మాట్లాడి.. వారి అభిప్రాయాన్ని బట్టి కార్యాలయం ఖరారు చేస్తారు. కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్.. ముగ్గురూ అత్యంత సమర్థులుగా పేరున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగానే ఎంక్వైరీ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com