ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలు సీజ్‌

ఢిల్లీలో భారీగా మాదకద్రవ్యాలు సీజ్‌
X

drug

దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. తొమ్మిది మంది సభ్యులున్న ఈ ముఠా నుంచి 13 వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను నార్కోటిక్ డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు పట్టుకున్నారు. 100 కోట్ల విలువైన 20 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌, ఆస్ట్రేలియాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో 20 కిలల కొకైన్‌ సీజ్‌ చేయగా, ఆస్ట్రేలియాలో 255 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు నైజీరియన్లు, అమెరికా, ఇండోనేషియా దేశస్తులు ఉన్నారు. ఈ ముఠా వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా, కెనెడా, ఇండోనేషియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా, నైజీరియా దేశాలతో పాటు దేశంలోని ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రల్లో కొందరు గ్రూపులుగా ఏర్పడి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ ముఠాను పట్టుకునేందుకు ఆపరేషన్‌ చేపట్టింది నార్కోటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు. భారత్‌లో పట్టుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా వంద కోట్లు కాగా, మొత్తం ఈ డ్రగ్స్ విలువ రూ. 1300 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లోనే భాగంగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన దాడుల్లో అక్కడి అధికారులు 55 కిలోల కొకైన్, 200 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story