జీఎస్టీ తర్వాత మరోసారి ఆర్జీవీ ..

జీఎస్టీ తర్వాత మరోసారి ఆర్జీవీ ..

rgv

జీఎస్టీ తర్వాత మరోసారి మూవీ ఇష్యూలో పోలీస్ విచారణ ఎదుర్కొబోతున్నారు వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో తన వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి వాడారని రాంగోపాల్ వర్మపై కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్ ఫిర్యాదుతో వర్మకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హజరుకావాలని ఆదేశించారు.

సినిమా వివాదాల్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హజరవటం రాంగోపాల్ వర్మకు ఇది రెండో సారి. గతంలో జీఎస్టీ మూవీ విషయంలోనూ ఆయన పోలీసుల విచారణ ఎదుర్కున్నారు. జీఎస్టీ సమయంలో వర్మపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. న్యూడ్ మూవీని ఎలా అనుమతిస్తారంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. ఇక ఇప్పుడు అమ్మరాజ్యంలో కడపబిడ్డల మూవీ ఇష్యూలో కొద్ది గంటల్లో పోలీసుల ఎదుట హజరవబోతున్నారు.

అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ఒక పొలిటికల్ సెటైర్ మూవీగా అంటున్నారు రాంగోపాల్ వర్మ. అయితే నిజజీవితంలో వ్యక్తులను అనుకరించినట్లు, వాళ్లని అవమానించినట్లు ఉండటంతో ఈ సినిమాను మొదట్నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పట్నుంచి రిలీజ్ వరకు చాలా వివాదాలు నడిచాయి. ఈ వివాదాలతో పలుమార్లు సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తూ ఆఖరికి డిసెంబర్-12న థియేటర్లలోకి తెచ్చారు.

అయితే..సినిమాకు సంబంధించిన లుక్స్, టీజర్, సాంగ్స్‌‌లో తనను అవమానించారంటూ కేఏ పాల్ తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వర్మ ఒక పిచ్చి సినిమా చేశారని.. దీని ద్వారా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story