అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన రాయలసీమ విద్యార్థులు

X

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ.. కర్నూలుకు చెందిన విద్యార్ధులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టుతో పాటు తమకు రెండో రాజధాని కేటాయించాలని.. కృష్ణా రివర్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. సీమ విద్యార్ధులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విద్యార్ధులు వాగ్వాగాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడటంతో.. విద్యార్ధుల్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
