భలే మంచి బాసు.. మందెక్కువైతే ఆఫీసుకి వెళ్లక్కర్లే..

భలే మంచి బాసు.. మందెక్కువైతే ఆఫీసుకి వెళ్లక్కర్లే..

drinker

సారూ.. రాత్రి మందెక్కువైంది.. మత్తుగా ఉంది.. మంచం దిగబుద్ది కావట్లే.. ఈరోజు సెలవిస్తారా.. ఇలా ఎప్పుడైనా మీ బాస్‌కి ఫోన్ చేశారా.. ఆ మరుక్షణమే మీ ఉద్యోగం కాస్తా ఊష్టింగ్ అయిపోదూ.. కానీ ఇక్కడి బాస్ సెపరేట్. అందరి బాసుల్లా కాదు. ఏం నాయనా మందెక్కువైందా.. ఓకే లీవ్ గ్రాంటెడ్ అంటారు. మత్తు దిగింతరువాత ఇంటి నుంచే వర్క్ చేయమనే వెసులుబాటూ కల్పిస్తారు.

వాయువ్య ఇంగ్లాండ్‌లో గల ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థ 'హ్యాంగోవర్ డే' సెలవును అందుబాటులోకి తెచ్చింది. రాత్రంతా పార్టీలో ఎంజాయ్ చేసి, ఆనక ఓ పెగ్గు ఎక్కువేసి మత్తుగా పడుకున్నారనుకోండి. ఉదయాన్నే బద్దకంగా ఆఫీసుకి వస్తే మీరు పీకేది ఏమీ ఉండదని హాయిగా బజ్జోని లేచాకే పని చేయమంటోంది సంస్థ అందులో పని చేసే ఉద్యోగులను.

మందు కొడితేనే హ్యాంగోవర్ లీవా అంటే.. అదేం లేదు. మరే కారణం చేతైనా రాత్రి ఎక్కువ సేపు మేల్కొని, ఉదయాన్నే నిద్ర లేవలేకపోయినా సెలవు తీసుకోవచ్చంటున్నారు సంస్థ యజమానులు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందు బాబులంతా ఆహా! మాక్కూడా ఇలాంటి అవకాశం ఉంటే ఎంత బావుండు అని అనుకుంటున్నారు.

Read MoreRead Less
Next Story