దక్షిణ అమెరికా ప్రాంతాన్ని వణికిస్తున్న టోర్నడోలు

దక్షిణ అమెరికా ప్రాంతాన్ని వణికిస్తున్న టోర్నడోలు
X

rains

దక్షిణ అమెరికా ప్రాంతాన్ని టోర్నడోలు వణికిస్తున్నాయి. భయంకరమైన గాలులతోకూడిన వర్షం కురియడంతో ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. ఉత్తర అలబామా, మిస్సిసిపి, లూసియానా, ప్రాంతంలో టోర్నడోలు ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్దసంఖ్యలో నివాసప్రాంతాలు దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, దీంతో 30 వేలమందికి పైగా ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు వెల్లడించారు. అధికారులు సహాయకచర్యలు ముమ్మరం చేశారు.

Tags

Next Story