ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో ట్రైనింగ్..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. 249 ఖాళీల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిన్ టెస్ట్ AFCAT 2020 ద్వారా ప్లయింగ్ బ్రాంచ్, గ్రాండ్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వారికి హైదరాబాదులోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. పెళ్లికాని యువతీ యువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్ధులు afcat.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబరు 31వ తేదీ ఆఖరు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.indianairforce.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఖాళీల వివరాలు: ప్లయింగ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్-60, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)-105, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)-84 ఖాళీలున్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 60% మార్కులతో 10+2 పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 26 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com