'ఫైటర్' జానూని పట్టేశాడు.. పారితోషికం..

ఫైటర్ జానూని పట్టేశాడు.. పారితోషికం..

Janvi

బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్‌లో ఎంటరవుతోంది. అమ్మని ఆదరించిన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడానికి వచ్చేస్తోంది. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ విజయ్ దేవరకొండతో జత కట్టడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్న విజయ్ తన తదుపరి చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉండనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్‌కి జోడీగా జాన్వీ నటించనున్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫైటర్‌తో యాక్ట్ చేయడానికి జాన్వీకి బాగానే ముట్టజెబుతున్నారు నిర్మాతలు. దాదాపు రూ.3.5 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరించబోతున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది.

Read MoreRead Less
Next Story