ఉత్కంఠగా ఎదురుచూపులు.. నిర్భయ కేసులో సుప్రీం ఏం చెప్పనుంది?

ఉత్కంఠగా ఎదురుచూపులు.. నిర్భయ కేసులో సుప్రీం ఏం చెప్పనుంది?
X

NIRBHAYA

దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో మరికొద్ది గంటల్లో కీలక తీర్పు వెలువడనుంది. ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష ఖారారైంది. డిసెంబర్ 16 నాడే నిందితులకు ఉరిశిక్ష అమలు కావాల్సింది. అయితే, దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఉరిశిక్షకు అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఇక, అక్షయ్‌ కుమార్ రివ్యూ పిటిషన్ పైనా మంగళవారమే తీర్పు వెలువడాల్సింది. అయితే, ఈ కేసును విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి.. చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అకస్మాత్తుగా తప్పుకున్నారు. దీంతో విచారణ మళ్లీ వాయిదా పడింది. బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అక్షయ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్‌ పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. మరికొద్ది గంటల్లో వెలువడనున్న ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అక్షయ్‌ కుమార్ పిటిషన్‌ ను రివ్యూ చేసేది లేదని.. గత తీర్పే ఫైనల్ ని చెబితే.. దోషుల ఉరిశిక్షకు రూట్ క్లియర్ అయినట్టే.

ఇదిలావుంటే.. అక్షయ్‌ కుమార్‌ రివ్యూ పిటిషన్‌ పై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ కుటుంబానికి సాధ్యమైనంత వేగంగా న్యాయం చేయాలని కోరారు. అంతేకాదు, 2017 ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ సహ.. నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలని ఆశాదేవీ కోరారు. అలా చేస్తే.. దేశ వ్యాప్తంగా దోషులకు గట్టి సందేశం అందుతుందని అన్నారు.

2012లో జరిగిన నిర్భయ ఘటనలో.. 2017లో దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత కేసు పలు కీలక మలుపులు తిరిగింది. ఇటీవలకే దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే, తీహార్ జైల్లోనే దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బక్సర్ జైలు నుంచి ఇప్పటికే ఉరితాళ్లు ఆర్డర్ చేశారు. ఈ తాళ్లతో ఇప్పటివరకు కోల్ కతా అలీపూర్ జైల్లో రేపిస్టు ధనుంజయ్ ఛటర్జీని ఉరితీశారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ లను ఈ తాళ్లతోనే ఉరితీశారు.

ఇదిలావుంటే, తీహార్ జైల్లో ఒకే సమయంలో ఇద్దరికి మాత్రమే ఉరివేసేలా చాంబర్ వుంది. దీన్ని 1950లో నిర్మిచారు. అయితే ఇద్దరికి ఒకసారి, మరో ఇద్దరికి ఆ తర్వాత శిక్ష విధించడం సాధ్యం కాదు. ఎందుకంటే, మొదట ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేసినప్పుడు.. మిగతా ఇద్దరు దోషుల్లో బిహేవియర్ చేంజెస్ ఉండే అవకాశం వుంటుంది. అంటే, స్పృహ తప్పి పడిపోయినా.. షాక్ కు గురైనా.. శిక్ష అమలు సాధ్యం కాదు. అందుకే నలుగురినీ ఒకేసారి ఉరి తీసేలా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, కొత్త జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన 14 రోజుల తర్వాతే మరణశిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరి తీస్తున్నారో సమాచారం ఇవ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే ఛాన్స్ ఉంది. ఉరి వేసే ఒకరోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. వారు కోరుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని కొత్త జైలు నిబంధనలు చెబుతున్నాయి.

Tags

Next Story