ఉల్లిపాయల క్యూలైన్‌లో తొక్కిసలాట

ఉల్లిపాయల క్యూలైన్‌లో తొక్కిసలాట
X

onion

విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఉల్లిపాయల క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగింది. ఉదయం నుంచే సబ్సిడీపై ఇచ్చే ఉల్లి కోసం ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. తీరా అమ్మకాల కోసం గేటు తీశాక ఒక్కసారిగా అంతా తోసుకురావడంతో వృద్ధులు కిందపడిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో తాత్కాలికంగా ఉల్లి సరఫరా నిలిపివేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలం అయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఉల్లి కోసం క్యూలైన్లలో తోపులాటలు జరిగినా పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోనందు వల్ల మరోసారి అదే పరిస్తితి తలెత్తిందని అంటున్నారు.

ఉల్లి ధరలు ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా సామాన్యులు, పేదలకు ఇంకా అది భారంగానే ఉంది. దీంతో.. రైతు బజార్లలో ఇచ్చే సబ్సిడీ ఉల్లి కోసం అంతా బారులు తీరుతున్నారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో సెక్యూరిటీ మధ్య అమ్మకాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తునే.. ఇందులో వినియోగదారుల తప్పు కూడా ఉందంటున్నారు. కొందరు మళ్లీ మళ్లీ క్యూలైన్లలో నిల్చుని కొంటున్నారని తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. దీనివల్లే సరిపడ స్టాక్ వచ్చినా వినియోగదార్లకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నామని వివరిస్తున్నారు. ధర విషయంలో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో.. రైతుబజార్‌కి వచ్చేవారికి ఇబ్బందుల్లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు.

Tags

Next Story