ముఖ్యమంత్రిపై సభా హక్కుల నోటీస్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని


ముఖ్యమంత్రిపై సభా హక్కుల నోటీస్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. సోమవారం సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లు అంటూ సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన నోటీస్‌లో పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రూల్ నంబర్ 169 కింద సీఎం, ఇతర మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత సమావేశాల్లో సీఎంపై విపక్ష తెలుగుదేశం సభా హక్కుల నోటీసు ఇవ్వడం రెండోసారి. ఇటీవల మార్షల్స్‌కి- టీడీపీ సభ్యులకు అసెంబ్లీ ఆవరణలో వివాదం తలెత్తిన విషయంలో.. తాను అనని మాటలు ఆపాదించి సభలో అధికారపక్ష సభ్యులు మాట్లాడారంటూ గత వారం విపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనా టీడీపీ సభ్యులు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఇక.. సోమవారం మద్యంపై చర్చ సందర్భంగా CM తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ నోటీసు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

