వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. పదేళ్ల నరకం తరువాత బాధితుడికి విముక్తి

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. పదేళ్ల నరకం తరువాత బాధితుడికి విముక్తి

china

అసాధ్యం సుసాధ్యమైంది. ఇక నా బ్రతుకు ఇంతే అనుకున్న అతనికి.. కలలో కూడా ఎరుగని కొత్త జీవితం పరిచయమైంది. 18 ఏళ్లలో వచ్చిన వ్యాధితో నరకయాతన అనుభవించిన ఆయనకు దశాబ్ధకాలం తరువాత విముక్తి లభించింది. చైనాకు చెందిన లిహువాకు 18 ఏళ్ల వయసులో యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి తీవ్రత క్రమంగా పెరగటంతో అతని నడుము వంగి తల.. రెండు కాళ్ల మధ్యలో ఇరుక్కుంది. దీంతో లిహువా నరకాన్ని ప్రత్యక్షంగా చూసాడు. దీంతో అతనికి ఆహారం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేంది. తల్లి ఆయన ఆలనా పాలనా చూసుకుంటూ వచ్చేంది. చైనాలో అతనిని ఫోల్డింగ్ మ్యాన్ అని పిలుస్తారు.

ఈ వ్యాధి సోకిన తొలి రోజుల్లోనే వైద్యం చేసుకొని ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటంతో చికిత్స చేపించుకోలేకపోయారు. దీంతో పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే.. ఈ వ్యాధి పరిణామం పెరగటంతో లిహువా కుటుంబ సభ్యులు షెన్జెన్ యూనివర్శిటీ ఆర్థోపెడిక్స్ విభాగం వైద్యుడు ప్రొఫెసర్ తావ్ హయిరెన్‌ను కలిశారు. ప్రాణం ఉన్నంత వరుకూ.. ఈ నరకం తప్పదునుకునే లిహువా జీవితంలో వెలుగులు నింపడానికి వైద్యులు.. దేవుడులా వచ్చారు. కాదు.. కాదు.. దేవుడే వైద్యుల రూపంలో వచ్చాడేమో.

నాలుగు సార్లు అతనికి సర్జరీలు చేసి.. అతని శరీరంలో ఎముకులను విరక్కొట్టి.. సాధారణ స్థితికి తీసుకొని వచ్చారు. లిహువా ఇప్పుడు వాకర్ సాయంతో నడుస్తున్నాడు. కొద్దికాలంలోనే అతను ఎవరి సాయం లేకుండా నడుస్తాడని.. ప్రొఫెసర్ తావ్ హయిరెన్ ను తెలిపారు. తనకు కొత్త జీవితం ప్రసాధించిన ప్రొఫెసర్ తావోకు లిహువా ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story