'ఇద్దరి లోకం ఒకటే' హీరోగా ఇదే రాజ్ తరుణ్ చివరి చిత్రమా!

ఇద్దరి లోకం ఒకటే హీరోగా ఇదే రాజ్ తరుణ్ చివరి చిత్రమా!
X

iddari-lokam-okate

ఒక సినిమాపై బజ్ రావాలంటే ముందు కాంబినేషన్ సెట్ అవ్వాలి. ఆ తర్వాత సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తే సినిమా అంచనాలు పెరుగుతాయి. కానీ వీటిల్లో ఏది లేకపోయినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం ఖాయం. ఇప్పుడు ఈ దిశగానే వెళుతోంది ఇద్దరిలోకం ఒకటే సినిమా. ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడు గంగదాసు కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ నెల 25న విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశాడు. కానీ రిలీజ్ కి ముందే ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇద్దరిలోకం ఒకటే సినిమాపై అంచనాలు ఏమాత్రం లేవు. పాటలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అలాగే ట్రైలర్ చూస్తే రెగ్యులర్ లవ్ స్టోరీగానే ఉంది కానీ, కొత్త దనం ఏమీ కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన గత చిత్రం లవర్ దిల్ రాజు నిర్మాణంలోనే తెరకెక్కింది. అయితే భారీ ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు ఆ లోటను భర్తీ చేసే ఉద్దేశ్యంతో చేసిన ఇద్దరిలోకం ఒకటే మూవీ కూడా నిరాశపరచడం ఖాయంగా కనిపిస్తోంది. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరో రాజ్ తరుణ్ కి ఇదే హీరోగా చివరి సినిమా అవుతుందేమోననే డౌట్స్ కూడా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలతోనే పెద్ద హిట్స్ కొట్టి, భారీ లాభాలు చూస్తున్న దిల్ రాజు ఈ మధ్య ఆ చిన్న సినిమాలే దెబ్బకొడుతున్నాయి. ఆ లిస్ట్ లో ఇద్దరిలోకం ఒకటే కూడా చేరబోతుందంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Tags

Next Story