జబర్దస్త్ బ్యూటీ అదిరిందిగా.. నాగబాబుతో..

జబర్దస్త్ బ్యూటీ అదిరిందిగా.. నాగబాబుతో..

priyanka

జబర్దస్త్ షోలో లేడీ గెటప్ పాత్రలు పోషించీ పోషించీ అలవాటైపోయిందో లేక అమ్మాయిలా ఉంటేనే బావుందనుకున్నాడో ఏమో కానీ సాయి తేజ ప్రియాంకగా మారిపోయింది. సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. దాదాపు సంవత్సరం పాటు షోకి దూరంగా ఉన్న సాయి తేజ ఇప్పుడు ప్రియాంకగా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే జబర్దస్త్‌లో కాదు.. అదిరింది షోలో ప్రియాంక జాయిన్ అవ్వబోతోంది. ఇప్పటికే నాగబాబు సహా పలువురు కమెడియన్స్ ఈ షోకి జంప్ అయ్యారు. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర అదిరింది షోకి టీమ్ లీడర్స్‌గా పనిచేస్తున్నారు. ఈ షోలో తానూ నటించనున్నానని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది ప్రియాంక. జబర్దస్త్ షోలో లాగే ఇక్కడ అభిమానులు ఆదరిస్తారని ప్రియాంక భావిస్తోంది.

Read MoreRead Less
Next Story