క్రిస్మస్‌ను గతంకంటే వైభవంగా నిర్వహిస్తాం : మంత్రి కొప్పుల ఈశ్వర్

X
By - TV5 Telugu |18 Dec 2019 6:26 PM IST
ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే క్రిస్మస్ విందును గత ఏడాది కంటే రెట్టింపు వైభవంగా ఈ సారి నిర్వహిస్తున్నట్లు.. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 20 న ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విందుకు 8 వేల మంది హాజరు కానున్నారని... వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈశ్వర్ వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు జిల్లా, మండల కేంద్రాల్లో విందులతో పాటు గిఫ్ట్‌లు కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com