వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ అరెస్టు

వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ అరెస్టు

psycho-killer

వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ ను అరెస్టుచేశారు మెదక్ జిల్లా పోలీసులు. వారం రోజుల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట శివారు చెరువులో నిజామాబాద్ జిల్లాకు చెందిన బ్యూటిషియన్ స్రవంతి శవాన్ని గుర్తించారు పోలీసులు. ఆమె హత్యమిస్టరీని చేధించే క్రమంలో సీసీపుటేజ్ ఆధారంగా పాత నేరస్తుడు నీరుడి అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. మూడు హత్యలు, రెండు చోరీకేసుల్లో జైలుశిక్షను అనుభవించిన సైకో కిల్లర్ అరుణ్ కుమార్ జైలునుంచి రాగానే హత్యకు పాల్పడ్డట్లు తూప్రాన్ డీ ఎస్ పీ కిరణ్ కుమార్ వెల్లడించారు. స్రవంతిపై లైంగిక దాడికి పాల్పడగా...ఆమె ప్రతిఘటించడంతో హత్యచేసినట్లు ఆయన వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story