కాలేజీ అమ్మాయిలను రప్పించి ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నడిపిస్తోన్న..

కాలేజీ అమ్మాయిలను రప్పించి ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నడిపిస్తోన్న..

sex-racket

సూర్యాపేట జిల్లా నేరాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటి వరకు గంజాయి అమ్మకాలు, సైబర్‌నేరాలు, లాండ్‌ మాఫియా ఆగడాలు వంటి నేరాలు మాత్రమే పట్టణంలో వెలుగు చూశాయి. అయితే.. తాజాగా సూర్యాపేట పట్టణ నడిబొడ్డులో సాగుతోన్న హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో గత కొద్ది రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి గుట్టుగా వ్యభిచారం నడిపిస్తోంది ఓ మహిళ. ప్రధానంగా విజయవాడ,హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల నుంచి కాలేజీ అమ్మాయిలను రప్పించి ఫోన్ల ద్వారా విటులకు వలవేసి హెటెక్‌ వ్యభిచారం కొనసాగిస్తోంది.

గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు మహిళ సహా యువతులను,విటులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.100కి ఫోన్‌ చేసి వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల నిఘా లోపం వల్ల సూర్యాపేటలో ఇలాంటి మరెన్నో ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story