జనంబాట పట్టిన తెలంగాణ మంత్రులు

జనంబాట పట్టిన తెలంగాణ మంత్రులు
X

ts-minister

తెలంగాణ మంత్రులు జనంబాట పట్టారు. అభివృద్ధి క్రర్యక్రమాల్లో పాల్గొంటూ తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలను వల్లే వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూపాలపల్లి మండలం విజినేపల్లి గ్రామంలో సబ్‌ స్టేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘటన కేసీఆర్‌కే దక్కుతుందన్నారు ఎర్రబెల్లి. మంత్రి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికూడా ఉన్నారు.

ఇక మానసిక వికలాంగుల సాంస్కృతిక సంబరాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. గురుకులాల విద్యకు ప్రబుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తాము చేయని తప్పుకు మానసిక వికలాంగులుగా ఉన్న ప్రతి ఒక్కరి సంతోషమేత తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు మంత్రులు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పాల్మాకుల్ మోడల్ స్కూల్ విద్యార్థులకు సబితా సైకిళ్లు పంపిణీ చేశారు. దిశ ఘటన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు వారి ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

బాలికలు తప్పని సరిగా తమ మొబైల్‌ ఫోన్లలో 1098తో పాటు పోలీస్‌ హెల్ప్‌ లైన్‌, షీ టీమ్‌ యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం ఉదంతంపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

Tags

Next Story