అందరూ కలిసికట్టుగా పనిచేయాలి : చంద్రబాబు

అనంతపురం జిల్లా పర్యటనలో రెండవరోజూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. వైసీపీ నేతల దాడులతో ఇబ్బంది పడిన కుటుంబాలతో సమావేశం అయ్యారు. బాధితులతో మాట్లాడించారు..
మధ్యాహ్నం మడకశిర, రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వచ్చేది మన ప్రభుత్వమేనని..ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు..
టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకొని ఉంటే.. ఒక్కరు కూడా ఉండేవారు కాదని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు పనికట్టుకొని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, పోలీసులను పక్కనపెట్టి యుద్ధానికి రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి బలమెంతో తెలిసిపోతుందని అన్నారు. వైసీపీ బాధితులకు వడ్డీతో సహా పరిహారం కట్టించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు చంద్రబాబు.
పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని కాకుండా చట్టాన్ని గౌరవించాలన్నారు చంద్రబాబు. చట్టాన్ని అతిక్రమించే పోలీసులకు శిక్షలు తప్పవని.... . పదవి విరమణ చేసినవారనీ కూడా వదలిపెట్టబోమన్నారు చంద్రబాబు.
టీడీపీ లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని కానీ అది ఎవరి తరమూ కాదన్నారు చంద్రబాబు..ఊపిరి ఉన్నంత వరకు రాజీలేకుండా పోరాడతాను తప్ప వదిలే ప్రసక్తే లేని స్పష్టం చేశారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com