హస్తిన బాట పట్టిన డీకే అరుణ


మద్యపాన నిషేధం కోసం దీక్షాస్త్రం వేసిన బీజేపీ నేత డీకే అరుణ.. ఒక్కసారిగా ఆ పార్టీలో కొత్త జోష్ తీసుకు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి మహిళలు భారీగా ఈ దీక్షకు తరలి వచ్చారు. దీక్ష ద్వారా మద్యపాన నిషేధంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చ జరిగేలా చేశారు. అధ్యక్ష పీఠం చేపట్టాలంటే.. సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందన్న జాతీయ పెద్దల సూచనతో.. దీక్షకు దిగిన అరుణకు అనుకున్న దానికంటే ఎక్కువ మైలేజే వచ్చినట్టు ఆమె అనుచరులు భావిస్తున్నారు. దీంతో.. ఇదే అంశాన్ని డీకే అరుణ ఎన్‌క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీలో పెద్ద ఎత్తున చర్చజరగుతోంది.
దీక్ష ముగిసిన వెంటనే ఢీల్లీ బాట పట్టారు డీకే అరుణ. దీక్ష ద్వారా బీజేపీకి వచ్చిన మైలేజీని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష పదవికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇక తనకు అడ్డు లేకుండా రూట్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్టు చర్చసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్య నేత అండదండలున్న డీకే అరుణ.. తన బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డట్టు సమాచారం. తనను పార్టీలోకి తీసుకువచ్చిన రాం మాధవ్ ద్వారానే తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాం మాధవ్ అండదండలు ఉంటే అద్యక్ష పీఠం ఖాయం అన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది.
మరి.. హస్తిన బాట పట్టిన డీకే అరుణకు అదిష్టానం ఆశిస్సులు ఏ మేరకు లబిస్తాయి. తను నమ్ముకున్న నేతతో చేసిన లాబీయింగ్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

