అమరావతిలో రైతుల నిరసన జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్


సీఎం ప్రకటనపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. రాజధాని గ్రామం మందడం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం తెలియని ముఖ్యమంత్రి మూడు రాజధానులను ఏం చేసుకుంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు రాజధానిపై సీఎం చేసిన ప్రకటనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధానిపై మళ్లీ సమీక్షించే అధికారం జీఎన్‌రావు కమిటీకి లేదని రైతులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములమైన తమ హక్కులను కాలరాస్తున్నారని రాజధాని పరిరక్షణ కమిటీ తరపున రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

