అమరావతి రైతుల పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు

అమరావతి రైతుల పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు
X

ap-high-court

ఏపీ రాజధానిపై సీఎం చేసిన ప్రకటనతో తీవ్ర ఆందోళన చెందుతున్న అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 585 జీవోని సవాల్‌ చేశారు. రాజధానిపై మళ్లీ సమీక్షించే అధికారం జీఎన్‌రావు కమిటీకి లేదంటూ రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో హైకోర్టులో పిటిషన్‌ వేశారు అడ్వకేట్‌ అంబటి సుధాకర్‌. రాజధాని నిర్మాణం చేస్తామని చట్టబద్ధంగా రైతుల భూములు తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ అక్కడ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. నిపుణుల కమిటీ జీవో రద్దు చేయాలని కోరారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములమైన రైతుల హక్కులను కాలరాస్తున్నారని వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. వాదనలు విన్న హైకోర్టు.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags

Next Story