అమ్మానాన్న విడిపోయారు.. బాధగా ఉన్నా.. : హీరోయిన్ కళ్యాణి


పెళ్లై 24 ఏళ్లు అవుతుంది. పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్నా తమ నిర్ణయం మార్చుకోలేకపోయారు. వారి మధ్య కొనసాగుతున్న ఘర్షణను పిల్లల ముందుకు తీసుకురాకుండా విడిపోయారు. అదే విషయాన్ని ప్రస్తావించింది నటి కళ్యాణి.. అఖిల్ 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కళ్యాణి కోలీవుడ్‌లో నటించిన మొదటి చిత్రం హీరో. ఇందులో శివ కార్తికేయన్ కథానాయకుడు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా కళ్యాణి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
తన తల్లిదండ్రుల విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కుటుంబంపై చాలా ప్రభావం చూపిన మాట వాస్తవే కానీ.. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. విడిపోయేముందు ఇద్దరూ ఎమోషనల్‌గా చాలా బాధపడ్డారు. కానీ దాన్ని మా వరకు రానివ్వలేదు. వారు విడిపోవడం మమ్మల్ని కూడా షాక్‌కి గురిచేసింది. విడాకుల తాలూకు గొడవలన్నీ సమసి పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాం. నిజానికి అమ్మానాన్నలతో మాకు ఉన్న బంధం ఇదివరకటి కంటే మరింత బలపడింది. లిజీ, ప్రియదర్శన్‌లు 2016లోనే విడిపోయారు. పెళ్లి తరువాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు వాటికి ముగింపు లభించి ప్రశాంతంగా ఉన్నానని అన్నారు. తన ఇద్దరు పిల్లలు తాము తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

