ఊరించే ఉద్యోగం.. ఫోటోగ్రాఫర్ పోస్ట్‌కి నెలకు రూ.26 లక్షల జీతం..

ఊరించే ఉద్యోగం.. ఫోటోగ్రాఫర్ పోస్ట్‌కి నెలకు రూ.26 లక్షల జీతం..

Lepre

ఏమండీ.. ఏమండీ.. ఎక్కడో ఆ ఉద్యోగం చెప్పి పుణ్యం కట్టుకోరు.. ఆ ఉద్యోగం వస్తే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేస్తా.. అవునా.. అయితే సరే.. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ లెప్రె తనకో ఫోటోగ్రాఫర్ కావాలని ప్రకటన ఇచ్చాడు. అతడో పెద్ద మిలియనీర్. ఆయనకు ట్రావెలింగ్ చేయడం, ఫోటోలు దిగడం సరదా. తనతో పాటు ఓ ఫోటోగ్రాఫర్ ఉంటే ట్రావెల్‌ని మరింత ఎంజాయ్ చేయొచ్చని తలచాడు. అనుకున్నదే తడవుగా ఫోటోగ్రాఫర్ కావాలంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. జీతం కూడా బాగానే ఉంటుంది అంటూ నెలకు 37,600 డాలర్లు (సుమారుగా రూ.26.6 లక్షలు) అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రయాణంలో కనిపించే సుందర దృశ్యాలను కెమెరాలో బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫోటోగ్రాఫర్ పని. మరి దరఖాస్తు చేసుకోవాలంటే మీక్కూడా ప్రయాణాలు చేయాలనే ఆసక్తి ఉండాలి. పాస్ పోర్ట్ ఉండాలి.. ఓ మాంచి సొంత కెమెరా ఉండాలి. అడిగినవన్నీ ఉంటే ఓకే. వెంటనే అప్లై చేయడమే.. ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు. ఇప్పటి వరకు ఈ డ్యూటీని లెప్రె స్నేహితుడు మిచ్ చేసేవాడట. ప్రస్తుతం లెప్రెకు ఉన్న మరికొన్ని బిజినెస్‌లను పర్యవేక్షిస్తున్నాడట. అందుకే మరో వ్యక్తి కోసం ఈ గాలింపు.

Read MoreRead Less
Next Story