ఆ నిర్ణయంతో విశాఖకు భారీగా పెట్టుబడులు : మంత్రి గౌతంరెడ్డి

ఆ నిర్ణయంతో విశాఖకు భారీగా పెట్టుబడులు : మంత్రి గౌతంరెడ్డి
X

minister-gowthamreddy

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రతీరం ఉన్న రాష్ట్రం అంధ్రప్రదేశ్ అని.. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని ఏపీ ఐటీ మంత్రి గౌతం రెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరుగుతున్న భారత్ అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం వల్ల రక్షణ రంగ పెట్టుబడులకు కలిసి వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విశాఖకు భారీగా పెట్టుబడులు తరలివస్తాయన్నారు.

Tags

Next Story