హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తరహాలో అరుణ్ కుమార్ దారుణాలు..

హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తరహాలో అరుణ్ కుమార్ దారుణాలు..

psyco-killer-arun-and-srinu

అతనో సైకో కిల్లర్. కంటపడిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు తెగబడి హత్యలు చేయటం అతనికి అలవాటు. అలా ఐదుగురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ముగ్గురిని హత్య చేశాడు. అనవాళ్లు దొరక్కుండా మృతదేహాలను తగటబెట్టేశాడు. వారం క్రితం మృతి చెందిన బ్యూటీషన్ స్రవంతి హత్యతో సైకో కిల్లర్ ఘోరాలు వెలుగులోకి వచ్చాయి.

మెదక్ జిల్లా రామాయంపేట శివారులో ఉన్న చెరువులో సగం కాలిన మహిళ మృతదేహం. ఎవరు హత్య చేశారో తెలియదు. కారణం అంతుచిక్కలేదు. మృతదేహాన్ని గుర్తుపట్టడకుండా నిప్పుబెట్టారు. దీంతో పోలీసులకు కేసు ఛాలేంజింగ్ గా మారింది. పైగా దిశా కేసు నేపథ్యంలో కేసును సీరియస్ గా తీసుకున్నారు.

సీన్ అఫెన్స్ దగ్గర పెద్దగా క్లూస్ లేవు. దీంతో మర్డర్ మిస్టరీ చేధించేందుకు సీసీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులకు కేసు మిస్టరీ చేధించే క్లూ దొరికింది. పాత నేరస్తుడు అరుణ్ కుమారే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమ స్టైల్ లో ఎంక్వైరీ చేయటంతో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.

చెరువులో పడి ఉన్న మృతదేహం నిజామాబాద్ జిల్లాకు చెందిన స్రవంతిగా గుర్తించారు. సైకో కిల్లర్ అరుణ్ కుమార్.. గతంలో మూడు హత్యలు, రెండు చోరీలకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌, తిరుమలగిరి, ఆర్మూర్‌లో అతనిపై మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. జైలులో ఉన్న సమయంలోనే మృతురాలు స్రవంతి భర్తతో పరిచయం పెంచుకున్నాడు అరుణ్. ఆ పరిచయంతో బాధితురాలితో స్నేహం కలిపాడు. డబ్బు ఆశ చూపి రామాయంపేటకు శివారుకు తీసుకువచ్చి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అరుణ్ కుమార్ కంటపడిన మహిళల్ని వెంటబడి బలత్కారానికి తెగబడేవాడే అని పోలీసులు చెబుతున్నారు. హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి తరహాలోనే అరుణ్ కుమార్ దారుణాలు బయటపడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story