పబ్‌లో గానా బజానా.. అర్థనగ్నంగా తాగి ఊగుతున్న..


హైదరాబాద్ పంజాగుట్ట లిస్బన్ పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. రాత్రి పబ్‌పై దాడి చేసి 21 మంది యువతులు, 9 మంది యువకులు, ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి లక్ష 49 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సమయం దాటినా కూడ పబ్‌లో గానా బజానాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఫీజు లేకుండానే ఫ్రీగా యువతులను పబ్‌లోకి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా వచ్చే యువకులకు డాన్సర్ల సరఫరా చేయడంతో పాటు యువతుల్ని వ్యభిచారంలోకి దింపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పబ్‌లో అర్థనగ్న వస్త్రాలతో డాన్సర్లు తాగి ఊగుతున్నారు. గతంలో ఓ పబ్ ఎదుటే ఓ డాన్సర్‌ను వివస్త్రను చేసిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఈ దాడులు నిర్వహించారు. గతంలో కూడా ఈ పబ్‌పై కేసు నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

