విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాల నిరసలు.. ఉద్రిక్తత

పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లాలో పలు చోట్ల విద్యార్థలు ర్యాలి నిర్వహించారు. విజయనగరం మహారాజా కాలేజీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో.. కాలేజీ దగ్గరకు చేరుకున్న పోలీసులు.. బయటకు రాకుండా విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేంద్రమంత్రి గంగ్వార్ పర్యటన నేపథ్యంలో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు పార్వతీపురంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. సబ్ కలెక్టర్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని ఈడ్చుకెళ్లారు. బలవంతంగా విద్యార్థినుల చేతులకు తాళ్లు కట్టి లాక్కుపోయారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

