19 Dec 2019 4:46 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / కమెడియన్ అలీ ఇంట...

కమెడియన్ అలీ ఇంట విషాదం..

కమెడియన్ అలీ ఇంట విషాదం..
X

Ali-mother-died

టాలీవుడ్ స్టార్ కమెడియన్, బుల్లితెర హోస్ట్ అలీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ తీవ్ర అనారోగ్యంతో కన్ను మూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అలీ ప్రస్తుతం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ హిందీ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియగానే ఆయన హుటాహుటిన స్వగ్రామం చేరుకున్నారు. తల్లి పార్థివ దేహాన్ని హైద్రాబాద్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భాగ్యనగరంలోని మణికొండలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలీకి ఓ సోదరుడు కూడా ఉన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలీకి అమ్మంటే చాలా ఇష్టం. ఆమెను చాలా సార్లు మక్కా తీసుకు వెళ్లారు. వీలైనప్పుడల్లా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమెకు సేవలు చేయడం అలీకి ఇష్టమైన పని. అలీ అమ్మను ప్రేమించే విధానం ఇండస్ట్రీలో కథలుగా చెప్పుకుంటారు. స్టార్ కమెడియన్‌గా ఎదిగినా ఓ సామాన్య వక్తిలా అమ్మకు సేవలు చేస్తుంటారని తెలిసినవారంతా అలీని మెచ్చుకుంటారు.

  • tags
Next Story