ఇండియన్ నేవీలో ఇంటిదొంగలు.. పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు అరెస్ట్

ఇండియన్ నేవీలో ఇంటిదొంగలు.. పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు అరెస్ట్
X

indian-navy

ఇండియన్ నేవీలో ఇంటిదొంగలు. పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు నావికాదళ సిబ్బందిని ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. FIR నమోదు చేశారు. విజయవాడ కోర్టుకు తరలించారు. ఆ ఏడుగురి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్లు ఎవరు? ఏ ర్యాంక్‌లో పనిచేస్తున్నారు? పాకిస్తాన్‌లో ఎవరికి సమాచారం చేరవేస్తున్నారు? ఎన్నాళ్లుగా ఈ అడ్డగోలు పని చేస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్కామ్‌లో మరికొందరు సూత్రధారులు, పాత్రధారుల కోసం వేట సాగిస్తున్నారు. విచారణ చేస్తున్నారు.

భారత నావికాదళంలో దేశద్రోహులు ఉన్నట్టు కొన్నాళ్ల క్రితం అధికారులకు ఉప్పందింది. వాళ్లపై నిఘా ఉంచారు. వాళ్ల గుట్టు రట్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజన్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందుకు కేంద్ర నిఘా సంస్థల సహకారం తీసుకున్నారు. నావికాదళ నిఘా అధికారులు సైతం సహకరించారు. అలా.. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై FIR నమోదు చేశారు. ఓ హవాలా ఆపరేటర్‌ను కూడా అరెస్టు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ సాగుతోంది. మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Tags

Next Story