తెలంగాణలో అన్ని మతాలకు సమాన ఆదరణ: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ఆదరణ లభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా కేసీఆర్ క్రిస్మస్ ట్రీ వెలిగించారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్, న్యూఇయర్ విషెస్ చెప్పారు.. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి సీఎం ప్రసంగించారు.. తెలంగాణ నుంచి తాగునీటి సమస్య శాశ్వతంగా పోయిందన్నారు.. విద్యుత్ కష్టాలు తీరిపోయాయన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టుతో 75 లక్షల ఎకరాలు సాగవుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. క్రిస్మస్ విందులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com