ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్న జీఎన్‌రావు కమిటీ

నవ్యాంధ్ర రాజధానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన జీఎన్‌రావు కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న కమిటీ సభ్యులు డాక్టర్ కేటీ రవీంద్రన్, ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయ్ మోహన్ కాసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు. సమగ్రాభివృద్ధితోపాటు రాజధానిపైనా కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది.. పూర్తి కసరత్తు అనంతరం నివేదిక సిద్ధం చేసిన కమిటీ ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు సమాచారం.. కమిటీ నివేదిక తర్వాత రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జీఎన్ రావు కమిటీ ప్రధానంగా ఏయే అంశాలు రిపోర్ట్‌లో ప్రస్తావిస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానులపై ఇప్పటికే సీఎం జగన్ అసెంబ్లీలో సూత్రప్రాయంగా కొన్ని విషయాలు ప్రస్తావించిన నేపథ్యంలో.. రిపోర్ట్‌లో దీనిపై ఎలాంటి స్పష్టత ఉంటుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. 3 రాజధానుల అంశంపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఉంటాయా? అసలు ఈ విషయంపై 13 జిల్లాల నుంచి కమిటీ ఎలాంటి అభిప్రాయ సేకరణ చేసింది అనేది కూడా మరికొద్ది గంటల్లో తెలియబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com