రాజధాని 3 చోట్ల కాకపోతే.. 30 చోట్ల పెట్టుకుంటాం: మంత్రి పెద్దిరెడ్డి

రాజధాని 3 చోట్ల కాకపోతే.. 30 చోట్ల పెట్టుకుంటాం: మంత్రి పెద్దిరెడ్డి
X

peddy

GN రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించే ముందే.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల కాన్సెప్ట్ ప్రకారం.. అమరావతిలో రైతుల భూములు అన్ని వాపసు ఇచ్చేస్తామని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెడుతున్నామని, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుంది పెద్దిరెడ్డి అన్నారు. రాజధాని ఏర్పాటు అంశంలో కేంద్రానికి సంబంధంలేదని చెప్పారు. రైతుల భూములు వెనక్కు ఇస్తామని ఎన్నికల ప్రచారం టైమ్‌లోనే జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి అమరావతి లాంటి పెద్ద రాజధాని అవసరం లేదన్నారు. రాజధాని 3 చోట్ల కాకపోతే 30 చోట్ల పెట్టుకుంటామన్నారు.

Tags

Next Story