జోష్ మీదున్న తెలంగాణ మంత్రులు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

జోష్ మీదున్న తెలంగాణ మంత్రులు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
X

ministersఅన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందంటున్న తెలంగాణ మంత్రులు.. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అటు మేడారం జాతర అభివృద్ధి పనుల పర్యవేక్షణ.. ఇటు 10 కోట్ల రూపాయలతో చేపడుతున్న క్రిస్టియన్ భవన్ కు శంకుస్థాన. మరోవైపు కళ్యాణ లక్ష్మీ చెక్కులు.. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలతో జనంలో ఉంటున్నారు తెలంగాణ మినిస్టర్లు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్ కానుగా రంగారెడ్డి జిల్లా కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణ పనులకు పునాది రాయి పడింది.10 కోట్లతో చేపడుతున్న బిల్డింగ్ పనులకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ వచ్చాక క్రైస్తవులు ఆత్మగౌరవంతో బ్రతుకున్నారని అన్నారాయన. శుక్రవారం ఎల్బీ స్టేడియం వేదికగా క్రైస్తవ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారాయన.

ఫిబ్రవరి 5 నుంచి జరిగే మేడారం జాతర అభివృద్ది పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. జంపన్న వాగు, స్నానాల ఘట్టాల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సారి ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ కృషిచేస్తున్నారని మంత్రి అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే మహిళలకు గౌరవం దక్కిందని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజేంద్రనగర్ లోని స్త్రీనిధి 8వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంచి ఆశయం కోసం స్త్రీనిధి సంఘం పనిచేస్తుందని కొనియాడారు. ఈ సంఘసేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. 32 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి మహిళలకు అందించారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్‌ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత.. ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన దుప్పట్లు, బెడ్‌షీట్లను రోగులకు పంపిణీ చేశారు. అనంతరం ఐదు కోట్ల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని ప్రతి ఎకరాను సాగులోకి తేవడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా రాజేశ్వరరావు పేట శివారులోని రివర్స్‌ పంపుహౌజ్‌ను పరిశీలించారు. రాజేశ్వరరావు పేట పంపుహౌజ్‌ను కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

ఆ తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి హైదరాబాద్ శివారులో రిజర్వ్‌ ఫారెస్ట్‌లో జంగిల్‌ క్యాంప్‌ను మంత్రులు ప్రారంభించారు. నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్‌ ఫారెస్ట్ పార్కులు దోహదం చేస్తాయన్నారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూశారు. స్టూడెంట్స్‌కు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేశారు.

Tags

Next Story