ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. నిపుణుల కమిటీ నివేదికపై నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని తేల్చే నిపుణుల కమిటీ సీఎం జగన్‌కు నివేదికను అందజేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం జీఎన్ రావు నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు నివేదిక రూపంలో నివేదించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, సెక్రటరీ చల్లా విజయ్ మోహన్, సభ్యులు డాక్టర్ అంజలి మోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. సెప్టెంబర్ 13న ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది..
రాజధానిపై మధ్యంతర నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసిన కమిటీ.. విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించింది. ఎక్కడ ఏది అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలన జరిపింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది. అయితేమూడు రాజధానులు రావొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలతో కమిటీ నివేదికపై ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com