50 శాతం డీ కంపోజ్‌ అయిపోయిన దిశ నిందితుల డెడ్‌బాడీస్‌

50 శాతం డీ కంపోజ్‌ అయిపోయిన దిశ నిందితుల డెడ్‌బాడీస్‌

disha

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మొదట మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల వివరాలను అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు అందజేశారు. మృతదేహాల పరిస్థితిని చీఫ్‌ జస్టిస్‌కు వివరించారు గాంధీ సూపరింటెండెంట్‌ శ్రావణ్‌. డెడ్‌బాడీస్‌ 50 శాతం డీ కంపోజ్‌ అయ్యాయని కోర్టుకు తెలిపారు. మరో వారం రోజుల్లో పూర్తిగా డీ కంపోజ్‌ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే, దేశంలో ఇతర ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరచడానికి అవకాశం ఉందా అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టు కూడా తమ దగ్గర లేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపినట్లుగా సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story