నాగర్‌ కర్నూలు ఘటనపై హెల్త్‌ కమిషనర్‌ విచారణ

నాగర్‌ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యులు... ప్రసవం సరిగా చేయకపోవడంతో... శిశువు మొండెం నుంచి తల వేరైంది. ఈ దారుణ ఘటనపై హెల్త్‌ కమిషనర్‌ విచారణ నిర్వహించింది. శిశువు తల ఏమైందని అధికారులను హెల్త్ కమిషన్ ప్రశ్నించగా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్‌, డాక్టర్‌ సుధారాణిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

తలలేకుండా శిశువుని తీసి.. పసికందు మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు కలెక్టర్‌. కమిటీ పూర్తి నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణ ఘటనను ఆరోగ్య మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను అన్నారు MLA గువ్వల బాలరాజు. పసికందు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Tags

Next Story