సీఏఏకు వ్యతిరేకంగా రంగంలోకి దిగుతున్న రాజకీయ నేతలు


దేశాన్ని ఉద్రిక్తలతో ఊపేస్తున్న సీఏఏ బిల్లుపై పొలిటికల్ దుమారం కంటిన్యూ అవుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు సీఏఏకి ఎన్నార్సీ ముడిపెట్టి మాట్లాడుతున్నాయి. ఇన్నాళ్లు సీఏఏ బిల్లును తప్పుబడుతూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా విద్యార్ధుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా సంఘీభావం ప్రకటించారు. సీఏఏ వివక్ష చట్టమని.. ఎన్సార్సీతో తమ పూర్వికుల పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు జనం మరోసారి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రాబోతోందని అన్నారామె.
ఆందోళనలకు సోనియాగాంధీ మద్దతు ప్రకటించిన గంట వ్యవధిలోనే ప్రియాంక గాంధీ యాక్షన్ లోకి దిగారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర జరుగుతున్న నిరసనలో ఆమె పాల్గొన్నారు. ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వానికి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు దీదీ వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో పౌరసత్వ గుర్తింపు జరగాలన్న మమతా వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు మండిపడ్డారు. భారత్ ఆంతరంగిక వ్యవహారాల్లో థార్డ్ పార్టీ జోక్యం చేసుకోవాలని అనటం దేశం పట్ల మమత బెనర్జీ ఉద్దేశాన్ని తెలుపుతుందని విమర్శించారు. మరోవైపు సీఏఏ దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండటంతో కేంద్రం బిల్లు లక్ష్యాన్ని ప్రజలకు వివరించే పనిలో పడింది. 1987కి జులై 1 కి ముందు పుట్టిన వారు పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అలాగే వారి సంతానం కూడా ప్రత్యేకంగా ఎలాంటి సర్టిఫికెట్లు చూపించాల్సిన పని లేదని తెలిపింది. భారత పౌరసత్వాన్ని బర్త్ సర్టిఫికెట్, బర్త్ ప్లేస్ ఈ రెండింట్లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించి నిరూపించుకోవచ్చు. ఎలాంటి డ్యాక్యుమెంట్లు లేకున్నా స్థానికుల సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటారని వివరించింది. పౌరసత్వ సరవణ బిల్లుపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ప్రభుత్వ వర్గాలు ఈ ప్రకటన చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

