ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ కి అస్వస్థత

ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ కి అస్వస్థత
X

pejavar

కర్నాటకలోని ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం మంగళూరులోని KMC ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో స్వామీజీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని.. మరో 24 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్‌లోనే ఉంచాలి అంటున్నారు వైద్యులు..

స్వామిజీ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాలు ఆరా తీస్తున్నారు.. స్వామీజికి చెందిన వారితో ఫోన్‌లో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వామీజీని పరామర్శించారు. రేపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. స్వామీజీ ఆరోగ్యంపై వాకబు చేస్తున్న ఆమె.. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం మంగళూరు వచ్చి.. ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది.

కర్నాటక సీఎం యుడ్యూరప్ప ఆసుపత్రికి వెళ్లి స్వామీజీ ఆరోగ్యంపై ఆరా తీశారు. స్వామిజీ పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని ఆయన కోరారు. హిందూ ధర్మ కోసం జీవితాంతం పోరాడిన యోధుడు.. రామమందిర నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎప్పుడూ సమాజ హితం కోసం పని చేసే ఆయన క్షేమంగా ఉంటారని అభిప్రాయపడ్డారు..

పెజావర్ పీఠాధిపతి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారని తెలిసి.. దేశంలోని వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు, ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ప్రముఖ మధ్వ పీఠమైన ఉత్తరాది మఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ కూడా ఆస్పత్రికి వచ్చారు. పెజావర్‌ పీఠాధిపతిని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Tags

Next Story