బీ కేర్‌ఫుల్.. బండి మీద వెళ్లేటప్పుడు ఇలా చేయకండి.. వీడియో

బీ కేర్‌ఫుల్.. బండి మీద వెళ్లేటప్పుడు ఇలా చేయకండి.. వీడియో
X

ద్విచక్ర వాహనం మీద వెళ్లేటప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తులు గొడుగు పడుతుంటారు ఎండకో వానకో. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇలా చేయడం వల్ల గాలి వాటుకు గొడుగుతో పాటు ఆ యువతి కూడా కిందపడిపోయింది. అదృష్టం బావుండి వెనుక నుంచి వాహనాలు ఏవీ రాకపోవడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడింది ఆమె. గమనించిన స్థానికులు పరుగున వచ్చి ఆమెను లేపి ప్రథమ చికిత్స అందించారు. ఈ వీడియోను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవింగ్ చేస్తుండగా గొడుగులు వినియోగించరాదని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.

Next Story