నో ప్లాస్టిక్ నినాదంతో విజయవాడలో 10k రన్


నో ప్లాస్టిక్ నినాదంతో విజయవాడలో టెన్ కే రన్ నిర్వహిస్తున్నారు.. బందర్ రోడ్డులో అమరావతి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 కె, 5 కె రన్ జరుగుతోంది.. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి టీవీ5 మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.. రన్‌లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అమరావతి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ అన్నారు.. రన్నింగ్, వాకింగ్ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు.. ప్రభుత్వం తరపున కూడా ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన అమరావతి వాకర్స్ సభ్యులు, మీడియా పార్టనర్‌గా వ్యవహరించిన టీవీ5కి కలెక్టర్ అభినందనలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

