రాజధాని తరలించొద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్న అమరావతి వాసులు

X

రాజధానిలో ఆందోళలు రోజు రోజుకు ఉధృతం అవుతున్నాయి. రాజధాని ఇక్కడి నుంచి తరలించొద్దంటూ అమరావతి వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన రాజధాని రైతులు.. ఇవాళ కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. మందడంలో ప్రధాన రహదారిని దిగ్బంధించి రైతులు రోడ్డుపై బైటాయించారు. ప్రస్తుతం మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసులు టెంట్ వేయనివ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. టెంట్ ఇస్తే నోటీసులు ఇస్తామని షామియా నిర్వాహకులను పోలీసులు బెదిరించారని ఆరోపిస్తున్నారు.. టెంట్ వేయనివ్వకపోడంతో ఎండలోనే తమ ధర్నా కొనసాగిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
