నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
X

modhi-campaining

నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. చారిత్రక రాంలీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఇవాళ జరిగే మోదీ ఎన్నికల సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సభ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరి ఐడీ కార్డు చూసిన తరువాత సభలోకి అనుమతిస్తారు.

మోదీ సభ కోసం ఢిల్లీ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మోదీ ఎలాంటి హామీలు ఇస్తారు? ఏం ప్రకటన చేస్తారన్నదానిపై దేశరాజధాని వాసుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది కమల దళం.

Tags

Next Story