న్యూ ఇయర్ పార్టీ.. పీకల్దాక తాగేసి.. రోడ్డెక్కితే..

క్యాలెండర్లో నెలలు మారుతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనుషుల ఆలోచనా విధానం మాత్రం మారట్లేదు. డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా తాగి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలనే ధోరణికి స్వస్తి పలికేదెప్పుడు. తాగకపోతేనే తిన్నగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం కష్టం. ఇక తాగి డ్రైవ్ చేస్తే తన వల్ల మరొకరి ప్రాణాలకు ముప్పు.
బార్లు బార్లా తెరుచుకుని తాగండి.. తూలండి అని పిలుస్తుంటాయి. సగటు వ్యక్తి నుంచి మొదలు సెలబ్రెటీల వరకు మద్యం మత్తులో జోగుతుంటారు. అంతకు మించిన జీవితం ఏముందనుకుంటారు. ఎక్కడ పార్టీ చేసుకోవాలి.. ఎవర్ని పిలవాలి.. ఇప్పటికే నగర యువతీ యువకులు పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. పోలీసులకు టాస్క్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు.
అయితే ఈ సారి గతంలో కంటే ఎక్కువగా ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతోంది నగర పోలీస్ యంత్రాంగం. మద్యం మహాశయులవల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ.10 వేలు ఫైన్ వేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని మందు బాబుల్ని హెచ్చరిస్తున్నారు. ఇక హోటళ్లు, పబ్బులు, ఈవెంట్ నిర్వాహకులను కూడా తమ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com