సీసీఎస్ ఎస్సై సైదులు ఆత్మహత్య

సీసీఎస్ ఎస్సై సైదులు ఆత్మహత్య
X

si-suicide

హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఎస్‌ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది. సీసీఎస్‌ ఎస్‌ఐ సైదులు... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్‌పేట పీఎస్‌లో సీసీఎస్‌ ఎస్‌ఐగా సైదులు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన సైదులు 2007లో ఎస్‌ఐగా విధుల్లో చేరాడు. హైదరాబాద్‌లోని మొగల్పురా పీఎస్‌తో పాటు ట్రాఫిక్ వింగ్‌లోనూ విధులు నిర్వహించాడు. ఆరోగ్యం సహకరించకపోవడం.. తన మిత్రులు సీఐ స్థానాల్లో ఉండడంతో సైదులు గత కొద్ది రోజులుగా మానసిక క్షభకు గురైనట్లు తెలుస్తోంది.

Tags

Next Story