మహేష్.. మీరు నిజంగా గ్రేట్.. 3,172 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు..

మహేష్.. మీరు నిజంగా గ్రేట్.. 3,172 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు..
X

marriages

ఆర్థికంగా బాగున్నా అవసరానికి ఆదుకునే మనసు అందరికీ ఉండదు. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపాదన. మంచి పని చేస్తే మనసుకి తృప్తిగా ఉంటుందని భావించారు సూరత్‌కి చెందిన మహేష్. గత ఎనిమిదేళ్లుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ స్థానికుల మనసు దోచుకుంటున్నారు. కన్యాదానాన్ని దైవ కార్యంగా భావించిన ఆయన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తే దేవుడి ఆశీర్వదాలు లభిస్తాయని భావించారు. 2010లో మొదలుపెట్టి ఇప్పటికీ ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

మొదట్లో 20 నుంచి 30 మంది అమ్మాయిలకు ఒకేసారి పెళ్లిళ్లు చేసేవారు. తండ్రి లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారి అమ్మాయిలకు వరుడిని చూసుకుంటే వివాహం చేస్తామని ప్రకటన ఇవ్వడంతో క్యూ కట్టేస్తున్నారు. ప్రచారం కోసమో, మరో స్వకార్యం కోసమో ఈ వివాహాలు చేయట్లేదు. ఆర్థిక స్థోమత, భగవంతుని కృప ఉండడం వల్లే సామూహిక వివాహ కార్యక్రమాలు తలపెట్టానన్నారు. మహేష్ ఇప్పటివరకు 3,172 మంది అమ్మాయిలకు పెళ్లి చేశారు. మహేష్ ఆశీర్వచనాలతో అందరూ సుఖ సంతోషాలతో జీవితాలను కొనసాగిస్తున్నారు.

Next Story