సౌదీ అరేబియా: హరీష్ బంగెరా అరెస్ట్

X
By - TV5 Telugu |23 Dec 2019 11:56 AM IST
సౌదీ అరేబియా సోషల్ మీడియా వేదికగా విద్వేష ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోలీ కాబాకి వ్యతిరేకంగా జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని హరీష్ బంగెరా అనే వ్యక్తి చేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని, అతను పనిచేస్తున్న కంపెనీ ఇప్పటికే విధుల నుంచి తప్పించింది. ఆ కంపెనీనే పోలీసులకు అతని సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. 'దిస్ ... ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ.. సౌదీ అరేబియా కింగ్ .... ' అంటూ సోషల్ మీడియాలో నిందితుడు ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీనిపై పెను దుమారం చెలరేగింది. గల్ఫ్ లో నివసిస్తున్న వారందరూ చట్టాన్ని గౌరవించాలి. అక్కడ సోషల్ మీడియా పై నిఘా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com