మెట్రో ప్రయాణం మరింత హాయిగా..

మెట్రో ప్రయాణం మరింత హాయిగా..
X

metro

నగర వాసులకు మెట్రో రైలు ఎంతో ఊరటనిస్తుంది. పౌరుల ప్రయాణాన్ని మరింత సులువు చేసేందుకు మెట్రో అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే టికెట్ల కోసం లైన్లో నిలబడే పని లేకుండా క్యూఆర్ టికెట్ పద్దతిని అమలు చేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసిన తరువాత క్యూఆర్ కోడ్‌తో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ టికెట్ కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్వీస్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో ఇప్పటికే సుమారు 1000 బస్సులను రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది గ్రేటర్ ఆర్టీసీ. దశల వారీగా బస్సుల సంఖ్యను తగ్గించాలని చూస్తోంది. ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రాత్రి 11 గంటల వరకు రైళ్లను నడుపుతోంది.

Next Story