నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీకి షాక్ తగలనుందా?

రాజధాని అమరావతిపై కమిటీలు, చర్చలు అవసరమే లేదని.. ఈ ప్రాంతమే రాజధానిగా ఉంటుందని కమలానంద భారతి స్వామి అన్నారు. అమరావతిని విఘ్నం చేయాలనుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. మందడంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులకు కమలానంద భారతి మద్దతు పలికారు. ఉద్యమం ఆపవద్దని... రైతుల భద్రత, భవిష్యత్తు, జీవితం అమరావతితోనే ముడిపడి ఉందని చెప్పారు. ముద్ద ముద్దకు బిస్మిల్లా చేయరని.. అలాగే రాజధానికి వంద సార్లు శంకు స్థాపన చేయరంటూ కమలానంద భారతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 81 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఐదు విడతల్లో జరిగిన ఎన్నికలకు... కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే.. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన నేపథ్యంలో జార్ఖండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి.. జార్ఖండ్ రూపంలో షాక్ తగలనుందా? అక్కడ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్-JMM-RJD కూటమికి 38-50కి పైగా సీట్లను సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి.
కొన్ని సంస్థలు... హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందంటూ స్పష్టం చేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యే మద్దతు అవసరం. ఎగ్జిట్‌పోల్స్ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే..జార్ఖండ్‌లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం రఘువర్ దాస్ మాత్రం సర్వే ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ ఫలితం మాత్రమే మాదే అంటూ విజయంపై ధీమా వ్యక్తంచేశారు..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా... గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు. మేజిక్ ఫిగర్ 41కి ఎవరు చేరుతారు... ఎవరికి ప్రజలు పట్టంకట్టారన్నది మరికొద్ది తేలిపోనుంది. మరోవైపు ఏ కూటమి మేజిక్ ఫిగర్‌కి చేరుకోలేకపోతే.. హర్యానాలో మాదిరిగా ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఫలితాలు ఎలా ఉండనున్నాయో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పోగొట్టుకున్న బీజేపీకి జార్ఖండ్‌లోనూ ఓడితే... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. దీనికితోడు దేశవ్యాప్తంగా CAA బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న వేళ జార్ఖండ్ ప్రతికూల ఫలితాలు వస్తే బీజేపీ ఇమేజ్ మరింత దెబ్బతింటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com